కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వరుసగా ఆరోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కు సంబంధించిన పత్రాలను ఎరుపు రంగు బాక్సులో ఎందుకు తీసుకువస్తారంటే. దూరం నుంచే ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందనే కారణంతోనే ఎరుపు రంగును వాడుతారు. ఎరుపు రంగు వాడటం వల్ల అందులో చాలా ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని ప్రజలు భావిస్తారు ఈ సంప్రదాయం బ్రిటిష్ పాలన కాలం నాటి నుండి కొనసాగుతోంది.