అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్రం సాధించుకోవచ్చని నిరూపించిన ఘనత జాతిపిత మహాత్మా గాంధీజీకే దక్కుతుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. మంగళవారం కర్నూలులో బుధవారం పేటలో ఉన్న దళితవాడలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో హింసాత్మక పద్ధతుల్లో దేశానికి స్వాతంత్రం సాధించుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు