వచ్చే నెల 5వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మొత్తం మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని మంత్రి మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
5వ తేదీన మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, 6, 7 తేదీల్లో బడ్జెట్‌పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను సభ ముందు ఉంచాలని సర్కార్ యోచిస్తోంది.