చెన్నై నగరంలో మూడు వేర్వేరు లైన్లలో మెట్రో రైలు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో, భూగర్భ స్టేషన్లు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిపై ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ రెండో దశ భూగర్భ స్టేషన్లలోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో మినీ షాపులు, అల్పాహార కేంద్రాలను తెరవడానికి సన్నాహాలు చేస్తోంది. అనువైన స్టేషన్ల ఎంపికపై కసరత్తు జరుగుతోంది.