ఏపీ రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలకు గాను 13 చోట్ల టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. టీడీపీ తరఫున రఘురామకృష్ణంరాజు (నరసాపురం), లావు శ్రీకృష్ణదేవరాయలు(నరసరావుపేట), వల్లభనేని బాలశౌరి(మచిలీపట్నం)కి టికెట్లు లభించనున్నాయి.
జనసేనకు ఎన్ని ఇస్తారో నిర్దిష్టంగా తేలకపోయినా..ఇప్పటికి 13 సీట్లలో మచిలీపట్నం,కాకినాడ సీట్లు ఆ పార్టీకి దక్కాయి. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి(ఎస్సీ), రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ బరిలో ఉండనుంది.