సామాన్య పౌరులపై భారం పడకుండా జీవనశైలిని మరింత సులభతరం చేయడం ఈ బడ్జెట్ ముఖ్య ఉద్దేశం అని ప్రధాని మోదీ అన్నారు. అందులో భాగంగానే పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో కోట్ల ఇళ్లను నిర్మిస్తామని, మహిళలను లక్షాధికారుల్ని చేసే ‘లఖ్ పతి దీదీ’ పథకాన్ని 3 కోట్ల మందికి విస్తరించనున్నామని ప్రకటించామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధి పొందనున్నారని మోదీ తెలిపారు.