సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఇల్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరికి సకాలంలో బిల్లులు చెల్లించాలని, సిమెంట్ పంపిణీ, బిల్లులు చెల్లించడంలో ఆలస్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.