గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వద్ద కనీసం ఆరు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్ గురువారం తెలిపారు. ఈ ఆరు బిల్లులు తమ శాఖకు, గవర్నర్ కార్యాలయానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల దశలో ఉన్నాయని పాటిల్ చెప్పారు. సైన్ బోర్డులలో 60 శాతం కన్నడ భాష వినియోగానికి సంబంధించి కర్ణాటక భాషా సమగ్ర అభివృద్ధి (సవరణ) ఆర్డినెన్స్-2024ను గవర్నర్ తిరిగి పంపిన తర్వాత మంత్రి ఈ విధంగా స్పందించారు. గవర్నర్ వద్ద కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆయన కొన్ని వివరాలను కోరారని, వాటిని తమ శాఖ అందజేస్తోందని మంత్రి తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు, గవర్నర్ కార్యాలయానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నందున, ఈ సమయంలో నేను చర్చించాల్సిన పని లేదని పాటిల్ అన్నారు.