జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుపై కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ స్పందించారు. ‘ప్రధాని మోదీ, అమిత్ షావి వేధింపులు, ప్రతీకార రాజకీయాలు. ఏ సీఎం అయినా సరే ఈ విధంగా చర్యలు తీసుకోవడం బాధాకరం.
ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం. ఈడీ, సీబీఐ, ఐటీ సహాయంతో ప్రతిపక్ష నేతలపై దాడులు జరగుతున్నాయి’ అని విమర్శించారు.