ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో, పాదయాత్రలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని, డ్వాక్రా రుణాలు తీర్చారని వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కోన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. గాజువాకాలో నిర్వహించిన కార్యక్రమంలో రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కోఆర్డినేటర్ ఉరికూటి పూర్ణచంద్రరావు , నగర మేయర్ గొలగాని హరి కుమారి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొని సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.