ఏపీ మంత్రి రోజాకు ఊహించని పరిస్థితి ఎదురైంది. మంత్రి నెలలో ఒకసారి శ్రీవారి సేవలో పాల్గొంటూ ఉంటారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా నిత్యం శ్రీవారిని దర్శించుకుంటూనే ఉన్నారు. ఎప్పటిలాగే స్వామివారిని దర్శించుకోడానికి మంత్రి తిరుమలకు రాగా అనుకోని సంఘటన జరిగింది. శ్రీవారి ఆలయం దగ్గర మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి స్వామి వారి దర్శనం చేసుకొని ఆలయం వెలుపలకు వచ్చిన తర్వాత ‘జై అమరావతి’ అంటూ శ్రీవారి సేవకులు నినాదాలు చేశారు.. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్నారు. అమరావతికి మద్దతు ఇవ్వాలని.. జై అమరావతి అని నినదించాలంటూ రోజాను శ్రీవారి సేవకులు కోరారు. ఈ ఘటనతో అవాక్కైన మంత్రి రోజా.. ‘శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటి’ అని ప్రశ్నించారు.. దేవుడి సన్నిధిలో ఇలాంటివి సరికాదన్నారు. ఆ తర్వాత మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.