రచయిత మరియు సామాజిక కార్యకర్త, మాజీ ఐఏఎస్ అధికారి హర్ష్ మందర్‌పై సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు.
సీఈఎస్ తన ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతా నుంచి రూ.32.71 లక్షలను సంస్థలోని ఉద్యోగుల జీతాలు, అలవెన్సులతో పాటు కొంతమందికి బదిలీ చేసిందని సీబీఐ ఆరోపించింది. అంతకుముందు ఢిల్లీలోని ఆయన నివాసంతో పాటు సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.