ఏపీలోని ఏలూరు పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఇవాళ దెందులూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం రానున్న ఈ సభకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
110 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశారు. మొత్తం 3,298 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా జనం రానుండటంతో రాకపోకలకు అంతరాయం కలగకుండా 16వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాలను దారి మళ్లించనున్నారు.