చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించడంపై సీఎం జగన్కు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ధన్యవాదాలు తెలిపారు.
నా ఊపిరి ఉన్నంత వరకు జీవితాంతం సీఎం జగన్కు రుణపడి ఉంటానని చెప్పారు. సీఎం జగన్.. విద్య ద్వారా పేదలు జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తున్నారని అన్నారు.