కెనడా గడ్డపై ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హత్య చేయడంలో భారత్ పాత్ర ఉందని కెనడా ఆరోపించిన విషయం తెలిసిందే.
తాజాగా భారత్ విదేశీ ముప్పుగా మారిందని, తమ ఎన్నికలలో జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిక్లాసిఫైడ్ ఇంటెలిజెన్స్ నివేదికలో ఈ ఆరోపణలు చేసింది. కాగా దీనిపై భారత్ ఇంకా స్పందించలేదు.