2019 మే నెలలో పార్లమెంట్‌కి ఎన్నికలు జరుగనున్నాయని, అంతకుముందే స్థానిక ఎన్నికలు జరుపుతామని, ఇందువల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాలిక్ సూచించారు. ఇదిలా ఉండగా, 2016లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు చెల్లించిన డిపాజిట్‌ను తిరిగివ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు డిపాజిట్ నగదు అందలేదు. దీంతో పలువురు అభ్యర్థులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందువల్ల డిపాజిట్ నగదు చెల్లించిన అభ్యర్థులందరికీ నగదు తిరిగి చెల్లించనున్నట్టు ఎన్నికల కమిషనర్ తెలిపారు.
