మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సీబీఐ నుంచి క్లీన్ చీట్ లభించింది. నెల్లూరు కోర్టులో ఫైళ్లు మాయం కావడంపై మంత్రిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఏడాది పాటు 88 మంది సాక్షులను సీబీఐ విచారింది. అయితే ఈ కేసులో మంత్రి పాత్ర లేదని తాజాగా 403 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్ ను దోషులుగా సీబీఐ నిర్ధారించింది.