మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ భర్త తన భార్యను కలపను చెక్కె ఉలితో కోసి చంపాడు. ఈ ఘటన ఢిల్లీలోని బురారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
సత్యవిహార్ ఏరియాలో 40 ఏళ్ల మహిళ రక్తపు మడుగులో పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె భర్త హతమార్చినట్లు తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు.