ఉరవకొండ మండలం ఆమిద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని సరస్వతి విగ్రహం పాక్షిక ధ్వంసం ఘటనలో కేసు నమోదు చేశామని ఉరవకొండ యు. పి. ఎస్ సి. ఐ తిమ్మయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినట్లు విషయం అందుకున్న వెంటనే సదరు పాఠశాలకు తానే స్వయంగా వెళ్లొచ్చానన్నారు. ఆకతాయిల పని అయి ఉండొచ్చని పాఠశాల సిబ్బంది తెలియజేశారని. సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa