బ్రహ్మసముద్రం మండల తహశీల్దార్ గా సోమవారం ఈశ్వరయ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నుంచి బ్రహ్మసముద్రం తహసీల్దారుగా బదిలీపై వచ్చినట్లు తెలిపారు. తహసీల్దారుకు రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa