గుజరాత్లోని నవ్సారిలో ఓ ఇంట్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సోమవారం నాడు తన 42 ఏళ్ల మనవడి మరణ వార్త విని 90 ఏళ్ల వృద్ధురాలు కుప్పకూలి మృతి చెందింది. లక్ష్మీబెన్ కసుంద్ర అనే మహిళ గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది.
మనవడు అశ్విన్ మరణవార్త విని కుప్పకూలినట్లు సమాచారం. గత కొంత కాలంగా అశ్విన్ ఆరోగ్యం క్షీణించడంతో అమ్మమ్మ ఆందోళన చెందుతోంది. అశ్విన్ చనిపోయాడని తెలుసుకున్న ఆమె అదే రోజు కన్నుమూసింది.