అన్నమయ్య జిల్లాలో స్మగ్లర్ల దాడిలో పోలీస్ చనిపోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టాస్క్ఫోర్స్ను కావాలనే జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
స్మగ్లర్లకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చే జగన్ ప్రభుత్వంలో పోలీసులకే రక్షణ లేదని ఎద్దేవా చేశారు. ప్రాణాలు కోల్పోయిన పోలీస్ గణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.