ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంజినీరింగ్ పనుల కారణంగా నిర్ణయం,,,,ఏపీలో పలు రైళ్లను రద్దు చేసిన అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 06, 2024, 09:38 PM

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. ఇంజినీరింగ్‌ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు రేపల్లె-సికింద్రాబాద్‌-రేపల్లె (17645/17646), గుంటూరు-సికింద్రాబాద్‌-గుంటూరు (12705/12706), గుంటూరు-వికారాబాద్‌-గుంటూరు (12747/12748) రైళ్లు, 6వ తేదీ నుంచి 9 వరకు నడికూడి-మిర్యాలగూడ(07973), కాచిగూడ-మిర్యాలగూడ (07276), మిర్యాలగూడ-నడికూడి (07277), మిర్యాలగూడ-కాచిగూడ(07974) రైళ్లు రద్దు చేశారు.


అలాగే ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు కాచిగూడ-రేపల్లె (17625), రేపల్లె-సికింద్రాబాద్‌ (17626) రైళ్లు నడవవని పేర్కొన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 11 వరకు గుంటూరు-సికింద్రాబాద్‌-గుంటూరు (17201/17202) రైలు కాజీపేట-సికింద్రాబాద్‌ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి జర్నీలు ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.


మరోవైపు సికింద్రాబాద్ వైపు వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. మౌలాలీ - సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్‌, నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ నెల 11వ తేదీ వరకు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నారు. సికింద్రాబాద్‌- గుంటూరు ఇంటర్‌ సిటీ(12705/06) ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- గుంటూరు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌(12714/13), హైదరాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఇంటర్‌ సిటీ(17011/12), కాగజ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ (12757/58), కాకతీయ ఎక్స్‌ప్రెస్‌(17659/60) పూర్తిగా రద్దు చేశారు. భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌(17233/14)ను, సికింద్రాబాద్‌- గుంటూరు మధ్య నడిచే 17201/02 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట నుంచి బయలుదేరుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com