రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉదయం 8 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఓటాన్ ఖాతా బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. సమావేశం అనంతరం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa