ప్రకృతి వ్యవసాయం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని డీజిఐజెడ్ ప్రతినిధి నవీన్ హరి అన్నారు. అంబాజీపేట మండలం వక్కలంకలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, రసాయనిక వరి పొలాలను జర్మనీ సంస్థ, ఇంటర్నేషనల్ వరి పరిశోధన స్థానం, ఓలమ్ అగ్రి గ్లోబల్ మార్కెటింగ్ ప్రతినిధులు బుధవారం సందర్శించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వివరించారు.