తాహాసిల్దార్లు స్వయంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కొత్తగా బదిలీపై వచ్చిన పాడేరు డివిజన్ 11 మండలాల తాసిల్దార్లతో కలెక్టర్ సమావేశం మందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థుల ఖర్చులను పక్కగా నమోదు చేయాలన్నారు. మీడియాలో ప్రచురిస్తున్న ప్రకటనలు తప్పనిసరిగా పరిశీలించి ఖర్చులను గుర్తించి నమోదు చేయాలన్నారు.