ఇండోనేషియాలో శనివారం రాత్రి వచ్చిన సునామీ వల్ల మరణించినవారి సంఖ్య 400కి చేరింది. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియలేదు. 1450 మంది గాయపడ్డారని నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ పేర్కొంది. మృతుల్లో చాలా మంది విహార యాత్రకు ఇక్కడికి వచ్చినవారిని ఆ సంస్థ పేర్కొంది. గల్లంతైనవారి కోసం దర్యాప్తు జరుగుతోంది. సునామీ ధాటికి సుందా తీరం వెంబడి ఉన్న అనేక గృహాలతో పాటు హోటళ్ళ వంటి వాణిజ్య సముదాయాలు బాగా దెబ్బతిన్నాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa