క్రిస్మస్ వేడుకలకు పెన్సిల్వేనియాలోని బెర్న్ విల్లేలోని కోజియార్ గ్రామం సిద్దమైంది. ఏటా డిసెంబర్, జనవరిలో మాత్రమే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని అందంగా అలంకరిస్తారు. 1948 నుంచీ ఏటా ఇక్కడ కోజియార్ కుటుంబ సభ్యులు తమ ఇళ్లు, ఆస్తులను క్రిస్మస్‌కి ప్రత్యేకంగా రకరకాల రంగుల లైట్లతో అలకరించడంతో ఈ గ్రామం మిలమిలా మెరిసిపోతూ ఆకట్టుకుంటుంది.
పెన్సల్వేనియా ప్రభుత్వం ఈ గ్రామంపై ప్రచారం ప్రారంభించడంతో ఇదిప్పుడు ఓ ఆకర్షణీయమైన టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. అదికూడా ఏటా డిసెంబర్, జనవరిలో నే. ఈ రెండు నెలల పాటు , ఈ గ్రామంలో తరతరాలుగా కోజియార్ ఫ్యామిలీ అతిధులను ఆహ్వానిస్తుంటారు. ఈసారి కూడా క్రిస్మస్ వెలుగు జిలుగులతో కోజియార్ మిలమిలలాడుతోంది. పది లక్షల లైట్లతో చేసిన డెకరేషన్ కట్టిపడేస్తోంది. ఈ గ్రామం తమకు వారసత్వ సంపదగా వచ్చిందని, విదేశీ మారకద్రవ్యం కూడా చాలానే వస్తోందని ఇక్కడి జనం చెపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa