టీడీపీ వారు ధర్మ యుద్ధం చేయాల్సింది పొయి అధర్మ యుద్దం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. అయన మాట్లాడుతూ.... ప్రొద్దుటూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేస్తున్నాను.గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేశాము. 500 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాము. ఏబీఎన్, టీవీ-5, ఈనాడు పత్రికలు టీడీపీ కరపత్రాలుగా పనిచేస్తున్నాయి. టీడీపీ వారు ధర్మ యుద్ధం చేయాల్సింది పొయి అధర్మ యుద్దం చేస్తున్నారుమా కౌన్సిలర్లను 20 మంది వద్దకు వెళ్లి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నలుగురు కౌన్సిలర్లకు ఒక్కొక్కరికి 12 లక్షల 50 వేలు డబ్బు ఆశ చూపారు. టీడీపీ వారు చేస్తున్న ప్రలోభాలను మా కౌన్సిలర్లు తిరస్కరించారు. టీడీపీ అభ్యర్థి ఎంపిక కోసం 30 కోట్లు అడుగుతున్నారు. వైయస్ఆర్సీపీలో ప్రజాసేవలో ఉండేవారినే అభ్యర్థిగా ప్రకటించారు అని అన్నారు.