ఈ నెల 8వ తేదీ నుంచి టెట్ ప్రక్రియ (నోటిఫికేషన్‌తో) ప్రారంభం అవుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీల్లో https://cse.ap.gov.in/loginhome వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. 19వ తేదీన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తారు. 23 వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ లోపు రెండు సెషన్స్‌లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక కీ మార్చి 10వ తేదీన.. కీపై అభ్యంతరాల స్వీకరణ 11వ తేదీ దాకా ఉంటుంది. ఫైనల్ కీ మార్చి 13వ తేదీన రిలీజ్ చేస్తారు. మార్చి 14వ తేదీన టెట్ తుదిఫలితాలు వెలువడతాయి. వేరే రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీకి చెందిన వారి కోసం కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://cse.ap.gov.in/loginhome వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.