చంద్రబాబుపై అనేక ఆరోపణలు వచ్చాయి..ఎన్నో కేసులలో స్టే లు తెచ్చుకున్నారు. చంద్రబాబూ.. నీపై నమోదైన కేసులలో ఒక్క కేసులోనైనా నువ్వు సీబీఐ విచారణకి సిద్దమా?. మీ(చంద్రబాబు) పాత్ర లేకుంటే ఎందుకు సీబీఐ విచారణ కోరటం లేదు. నీపై వచ్చిన అభియోగాలపై ఎటువంటి విచారణకి సిద్దమా? లేదా? స్పష్టత ఇవ్వాలి అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నువ్వు నీతిమంతుడివైతే సీబీఐ విచారణ జరిపించుకోవాలి. 24 గంటల లోపుల నా సవాల్ కి స్పందించాలి. నా సవాల్ స్వీకరించకపోతే తాను అవినీతిపరుడని చంద్రబాబే ఒప్పుకున్నట్లే అని మంత్రి కాకాణి అన్నారు. చంద్రబాబు, టీడీపీ హయాం కంటే రైతులకు మేం ఎక్కువ మేలు చేశాం. టీడీపీ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణపై సీబీఐ విచారణకి సిద్దమా?. చంద్రబాబు మోసగాడని ప్రజలు భావిస్తున్నట్లుగానే.. ఇప్పుడు మోసపూరిత హామీలు ఇస్తున్నారు అంటూ మంత్రి కాకాణి చురకలు అంటించారు. సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగాఉంది.. కాబట్టే చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కాకాణి దుయ్యబట్టారు. ఏదైనా కొత్త పార్టీ వస్తే కూడా చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం విఫలం అయితే ఆయనకు ఇతర పార్టీలతో పొత్తులు ఎందుకు? అని ప్రశ్నించారు. చంద్రబాబు మోసం చేస్తారని ప్రజలకు కూడా అర్ధం అయ్యిందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.