ఈ నెల 12వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్‌తో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆన్‌లైన్‌లో 12వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య https://cse.ap.gov.in/loginhome లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. 24వ తేదీన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తారు. మార్చి 5వ తేదీ నుంచి హల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెండు సెషన్స్‌లో డీఎస్సీ పరీక్షలు ఉంటాయి. మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల అవుతుందని.. ఏప్రిల్ 1వ తేదీన కీలో అభ్యంతరాలపై స్వీకరణ ఉంటుందని.. ఆ వెంటనే ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తామని చెప్పారాయన. ఏప్రిల్ 7వ తేదీన డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.