త్వరలో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ మొదటి ఓటు వేసి రాష్ట్ర పునర్నిర్మాణంలో, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని టిడిపి నాయకులు అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గురువారం కళ్యాణదుర్గం టిడిపి ఇన్ చార్జి ఉమామహేశ్వర నాయుడు సూచన మేరకు కళ్యాణదుర్గం పట్టణంలోని జ్యోతిర్మయి బాలికల డిగ్రీ కళాశాలలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సీ. బి. ఎన్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు.