సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు బీఈడీ అభ్యర్థులూ అర్హులేనంటూ ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి అర్హత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీఈడీ చేసిన వారు SGT, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు కాగా..
ఎస్జీటీ పోస్టులకు మాత్రం అర్హత లేదంటూ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం కేసులో సుప్రీం తీర్పునిచ్చింది. అయితే దీనిపై జాతీయ ఉపాధ్యాయ మండలి క్లారిటీ ఇవ్వనందున పాత నిబంధనలే అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.