మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది. భారత ఓటర్లను ఫోన్ కాల్స్ ద్వారా విజ్ఞప్తి చేసే కార్యక్రమాన్ని అమెరికాలోని ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ రూపొందించింది.
ఇందు కోసం 24 ప్రత్యేక బృందాలను నియమించింది. అలాగే బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి 3 వేల మంది ఇండో అమెరికన్ల బృందాన్ని పంపడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.