గ్రామంలోని రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కైకలూరు సర్పంచ్ మేరీ నవరత్న కుమారి కోరారు. ఇటీవల తహశీల్దార్లు బదిలీల్లో భాగంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో పనిచేసిన ఎస్ పోతురాజు కైకలూరు తాసిల్దారుగా బాధ్యతలు చేపట్టారు. గురువారం ఆయనను సర్పంచ్ , సిబ్బంది స్వాగతం పలికి పలు విషయాలను ఎంతెలియజేశారు అనంతరం జగనన్న గ్రీన్ విలేజిలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పరిశీలించారు.