ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ ప్రయోజనాల కోసమే నాపై ఆరోపణలు చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 09, 2024, 05:28 PM

రాజకీయ ప్రయోజనాల కోసమే సోమిరెడ్డి త‌న‌పై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. కృష్ణ పట్నం పోర్టు లో కంటైనర్ టెర్మినల్ ను కొనసాగించేందుకు అన్ని విధాలా కృషి జరుగుతోందన్నారు. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టు లో కంటైనర్ టెర్మినల్ విష‌యంపై రాష్ట్ర.. కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు. అఖిల పక్షం నేతలు ఎవరూ మాట్లాడటం లేదన్నారు. కానీ టీడీపీ నేత సోమిరెడ్డి మాత్రం నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారన్నారు. ఆయన నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో సెంబ్ కార్ప్ విషయంలో కూడా ఇదే తరహాలో ఉద్యమం చేసి, అఖిల పక్షాన్ని మోసం చేశారన్నారు. కంటైనర్ టెర్మినల్ కొనసాగుతుందని, ఇటీవల కాలంలో కంటైనర్ వ్యాపారం తగ్గిందన్నారు. టెర్మినల్ లో కార్యకలాపాలు కొనసాగించేలా చూడాలని కేంద్ర మంత్రి కి కూడా లేఖ రాశామని, రాజకీయ ప్రయోజనాల కోసమే సోమిరెడ్డి నాపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com