హైవేలపై టోల్ కలెక్షన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఫాస్ట్ ట్యాగ్ స్థానంలో GPS టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను అమలు చేయాలని భావిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల కోడ్ త్వరలో రానుంది. అంతకు ముందే GPS టోల్ కలెక్షన్ సిస్టమ్ అమలు చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. 2021లో అమల్లోకి తెచ్చిన ఫాస్ట్‌ట్యాగ్‌ను ఏప్రిల్ తర్వాత దశలవారీగా తొలగించనుంది.