భారత ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని ఓ నివేదికలో తెలిపింది. గత 2019 పార్లమెంటరీ ఎన్నికల కంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 6% ఓటర్లు ఎక్కువగా ఉన్నారని పేర్కొంది.
పురుష ఓటర్లు 49.7 కోట్లు, మహిళా ఓటర్లు 47.1 కోట్లు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 48,044 మంది థర్డ్ జెండర్లు, 88.35 లక్షల మంది వికలాంగులు, 2.63 కోట్ల మంది కొత్త ఓటర్లు ఉన్నారు.