భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్రం ప్రభుత్వం మాజీ ప్రధానులు పీవి నరసింహరావు, చరణ్ సింగ్ లకు ప్రకటించింది. ఇప్పటివరకు మన దేశానికి 14 మంది పూర్తి స్థాయి ప్రధానులుగా సేవలు అందించారు. వీరిలో 8 మంది భారతరత్న పురస్కారానికి ఎంపిక అయ్యారు.
జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం), ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ (మరణానంతరం), మొరార్జీ దేశాయ్, వాజ్ పేయీలకు గతంలోనే ఈ అవార్డు దక్కింది. తాజాగా పీవీ, చరణ్ సింగ్ వారి సరసన నిలిచారు. ప్రస్తుత ప్రధాని మోదీ, మాజీ ప్రధానులు వీపీ సింగ్, చంద్రశేఖర్, హెబ్రీ దేవేగౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ లకు భారతరత్న ఇంకా దక్కలేదు.