మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం 'భారతరత్న' ప్రకటన చేసింది. పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు. ప్రధానిగా ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలతో ప్రపంచ మార్కెట్లకు భారత్ తలుపులు తెరుచుకున్నాయి.
"పీవీ విశిష్ట మేధావి. ఉమ్మడి ఏపీ సీఎంగా, కేంద్రమంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఏళ్ల తరబడి ప్రజాసేవ చేశారు. ప్రధానిగా పీవీ తీసుకున్న నిర్ణయాలు భారత ఆర్థికాభివృద్ధిలో నవ శకారంభానికి దోహదం చేశాయి. మన విదేశాంగ విధానం, భాషలు, విద్యారంగానికి చేసిన సేవలు ఆయనలోని బహుముఖ ప్రజ్ఞను చాటాయి.