తిరుపతి జూ పార్క్ లో చిరుత మృతి చెందింది. చిరుత అస్వస్థతకు గురి కావడంతో వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో వైద్యాన్ని అందించారు. అయితే చివరకు చిరుత మరణించిందని జూ పార్క్ అధికారులు ప్రకటించారు.
చిరుత మృతి చెందిందని తెలియడంతో ఉన్నతాధికారులు వచ్చి విచారణ జరిపారు. చిరుత కొంతకాలంగా అస్వస్థతతో ఉందని, అయితే వైద్యసాయం అందించినా మరణించిందని అధికారులు వివరించారు.