మనం నిజ జీవితంలో గానీ, వీడియోల్లోగానీ చాలా ప్రాంతాల్లో మెయిన్ రోడ్లను నలుపు రంగులో చూసి ఉంటాం. కానీ ఓ ప్రాంతంలో రోడ్లు నీలం రంగుల్లో ఉంటాయట. ఎక్కడనుకుంటున్నారా గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతర్ దేశంలో.
అవును అక్కడ నీలం రంగులో రోడ్లు దర్శనమిస్తాయి. దానికి గల కారణం లేకపోలేదు. గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఇలా నీలిరంగులో రోడ్లను వేస్తుందట ఖతర్ ప్రభుత్వం.