కరువు సహాయక చర్యలు చేపట్టాలని రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పరమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తిక్కన్న డిమాండ్ చేశారు. సోమవారం పెద్దకడబూరులోని మండల తహసీల్దార్ ఆఫీసు ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు, పంటల భీమా వర్తింప చేయాలని, రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని తహసీల్దార్ సురేష్ బాబుకు వినతిపత్రం అందజేశారు.