ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15న కర్నూల్, గుంటూరు జిల్లాలకు సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 03:01 PM

ఈ నెల 15న సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూల్, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూల్‌లో ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్నారు.
గుంటూరు జిల్లా ఫింగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు. గురువారం ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూల్ చేరుకుంటారు. పెళ్లి వేడుకలో హాజరైన తర్వాత మళ్లీ తాడేపల్లి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:40 గంటలకు గుంటూరుకు బయలుదేరుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa