తిరుమల శ్రీవారి హుండీకి మరోసారి కాసుల వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారి హుండీకి సోమవారం రూ.5.48 కోట్లు ఆదాయం వచ్చింది. మళ్లీ చాలా రోజుల తర్వాత హుండీ ఆదాయం రూ.5 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. సోమవారం 69,314మంది స్వామివారిని దర్శించుకున్నారు.. 25,165మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కొండపై రద్దీ కొనసాగుతోంది.. ఏకంగా 20 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ టికెట్ లేని సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
ఫిబ్రవరి 16న శ్రీ కోదండరామాలయంలో రథసప్తమి
తిరుపతి శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆరోజు ఉదయం భానుని కిరణాలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామివారి లలాటపలకం, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 7 గంటలకు సూర్యప్రభవాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
మార్చి 1 నుండి 10వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 29న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.. 01-03-2024న ఉదయం – ధ్వజారోహణం రాత్రి – హంస వాహనం.. అలాగే
02-03-2024 ఉదయం – సూర్యప్రభ వాహనం రాత్రి – చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది. 03-03-2024న ఉదయం – భూత వాహనం రాత్రి – సింహ వాహనం.. 04-03-2024 ఉదయం – మకర వాహనం రాత్రి – శేష వాహన సేవ. 05-03-2024 ఉదయం – తిరుచ్చి ఉత్సవం రాత్రి – అధికారనంది వాహనం.. 06-03-2024 ఉదయం – వ్యాఘ్ర వాహనం రాత్రి – గజ వాహనం.. 07-03-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి – అశ్వ వాహనం.. 08-03-2024 ఉదయం – రథోత్సవం (భోగితేరు) రాత్రి – నందివాహనం.. 09-03-2024 ఉదయం – పురుషామృగవాహనం సాయంత్రం – కల్యాణోత్సవం, రాత్రి – తిరుచ్చి ఉత్సవం వాహన సేవ ఉంది. 10-03-2024 ఉదయం – త్రిశూలస్నానం సాయంత్రం – ధ్వజావరోహణం, రాత్రి – రావణాసుర వాహన సేవ ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa