దేశవ్యాప్తంగా రైతన్నలు మరోసారి ఉద్యమ బాట పట్టారు. పింఛన్లు, పంటలకు కనీస మద్ధతు ధర, కార్మిక చట్ట సవరణలను ఉపసంహరణ.. తదితర డిమాండ్లతో దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం భారీ నిరసన చేపట్టారు.
అలాగే, ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ చేపడ్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. ఉదయం 6 నుంచి 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. పంజాబ్‌లో శుక్రవారం నాలుగు గంటల పాటు రాష్ట్ర, జాతీయ రహదారులను మూసివేయనున్నారు.