అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగాయి. ప్యూర్టో రికోలో కొంతమంది దుండగులు కదులుతున్న కారు నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా..
మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్యూర్టో రికోలోని ప్యూర్టో రికన్ బార్ వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని, గాయపడ్డవారిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa