పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) తరపున ప్రధాని అభ్యర్థిగా తన సోదరుడు, మాజీ ప్రధాని షహబాజ్ షరీఫ్(72)ను నామినేట్ చేశారు.
దీంతో షహబాజ్ మరోసారి పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. PML-N అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు తన ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.