ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నెల్లూరు జిల్లాలో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది.
అయితే, తాను కోరిన విధంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేయకపోవటంతో వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. తాజాగా చంద్రబాబుతో భేటీ అయినట్లు సమాచారం. అయితే సీఎం జగన్ కు మాత్రం ప్లాన్ బీ ఉన్నట్లు తెలుస్తోంది.